Healthhealth tips in telugu

ఈ లక్షణాలు మీలో ఉంటే డయబెటిస్ ఉన్నట్టే…వెంటనే చూసేయండి మరి

Diabetes symptoms in telugu :డయబెటిస్ సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ డయబెటిస్ బారిన పడుతున్నారు. శరీరంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగినప్పుడు దానిని కంట్రోల్ చేసే సామర్ధ్యం శరీరానికి లేనప్పుడు డయబెటిస్ వస్తుంది. డయబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడలసిందే.
Diabetes In Telugu
డయబెటిస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయబెటిస్ ని తరిమి కొట్టవచ్చు. అయితే డయబెటిస్ ప్రారంభాన్ని ఎలా గుర్తించాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. దాహం విపరీతంగా వేస్తుంది. ఎంత తాగిన గొంతు ఆరిపోతుంది.

దాహం ఎంతకూ తగ్గదు. ఇలా ఒకటి రెండు రోజులు ఉంటే ఏ సమస్య ఉండదు. ప్రతి రోజు ఇలానే ఉందంటే మాత్రం డయబెటిస్ టెస్ట్ చేయించుకోవలసిందే. ఎంత ఆహారం తీసుకున్నా కొంచెం పని చేసేసరికి తొందరగా అలసిపోతారు.

ఎటువంటి డైట్ ప్లాన్ చేయకపోయిన బరువు తగ్గిపోతే,చిన్న చిన్న గాయాలు కూడా త్వ‌ర‌గా త‌గ్గ‌కుండా ఇబ్బంది పెట్టటం,కాళ్లు త‌ర‌చూ తిమ్మిర్లు రావ‌డం, కంటి చూపు మండ‌గించ‌డం, ఉన్న‌ట్టు ఉండి కాళ్లలో స్పర్శ త‌గ్గిపోవ‌డం వంటివి కూడా డయబెటిస్ లక్షణలే.ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ ని సంప్రదించి డయబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఒక అవగాహన కోసం మాత్రమే.