MoviesTollywood news in telugu

యాంకర్ ప్రదీప్ సినిమాకు రికార్డ్ కలెక్షన్… ఎన్నికొట్లో…?

Anchor Pradeep :యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఎవరూ లేరు. బుల్లితెర అభిమానులను ఎంతగానో అలరిస్తున్న ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ వెండితెర పై మెరిశాడు.బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్ వెండితెరపై కూడా సక్సెస్ అయ్యాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

జనవరి 29న విడుదలైన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా మూడు రోజులు పూర్తయ్యే సరికి 4.51కోట్ల కలెక్షన్లను రాబట్టిందని టాక్. మరో 0.50 కోట్ల షేర్ ను రాబడితే ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచినట్టే అని చెప్పాలి. గ్రాస్ పరంగా ఏకంగా ఈ సినిమా దాదాపు పదికోట్లను కొల్లగొట్టిందని తెలుస్తోంది.