Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆహారాలు తింటే… చాలా ప్రమాదం

Diabetes Diet Plan Telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ వ్యాధితో బాధ పడుతున్నారు 30 ఏళ్ళు వచ్చేసరికి డయాబెటిస్ వచ్చేస్తోంది డయాబెటిస్ వచ్చింది అంటే జీవితకాలం మందులు వేసుకోవాల్సిందే అలాగే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. అరటిపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నా డయాబెటిస్ ఉన్నవారు మాత్రం దూరంగా ఉండాల్సిందే. అరటి పండులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి

కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు అరటిపండు తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అందువల్ల అరటిపండుకి దూరంగా ఉంటేనే మంచిది. నిల్వ ఉన్న ఆవకాయలు తినకూడదు ఎందుకంటే వీటిల్లో ఉండే సోడియం డయాబెటిస్ ఉన్న వారిలో అధిక రక్తపోటు వచ్చేలా చేస్తుంది. ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికొస్తే కిస్మిస్ ఎండు ఖర్జూరం అంజీర్ వంటివి మంచిది కాదు ఎందుకంటే వీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది వీటిని ఒకవేళ తీసుకున్నా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అంతేకాకుండా ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్యాక్ చేయబడిన స్నాక్స్ వంటివి కూడా మంచిది కాదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."