MoviesTollywood news in telugu

నిహారిక గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన చైతన్య

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక చైతన్య వివాహం గత సంవత్సరం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో జరిగిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య నిహారిక గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. నిహారిక చైతన్య ఇద్దరూ క్లాస్ మేట్స్. తొమ్మిదో తరగతి చదువుతున్న అప్పటినుంచి నిహారిక తెలుసని చైతన్య చెప్పాడు.

నిహారిక ఎక్కువగా బాగా మాట్లాడుతుంది అని, నేను ఎక్కువగా మాట్లాడను అని చెబుతూ సినిమాల్లోకి వచ్చే ఆలోచన అసలు లేదని చైతన్య చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని అడిగితే ఒకరికొకరు నీవంటే నీవు అని చెప్పారు. పెళ్లి అయ్యి రెండు నెలలు అయినా కరోనా కారణంగా బయట ఎక్కువగా తిరగ లేదని నిహారిక చెప్పింది అలాగే చైతన్య చాలా తక్కువగా మాట్లాడతాడు అని చెప్పింది బాగా దగ్గరి స్నేహితులు అయితే బాగా మూవ్ అవుతాడని చెప్పింది. నిజ జీవితంలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉంటే చాలని నిహారిక అంటుంది.

పెళ్లి తరువాత కొత్త సినిమాకు కమిట్ కాలేదని ప్రస్తుతం వెబ్ సిరీస్ లు ఎక్కువగా చేస్తున్నానని నిహారిక తెలిపారు.ఇద్దరిలో చైతన్య ముందు సారీ చెబుతాడని 2020 సంవత్సరం మే నెల 27వ తేదీ ప్రేమను వ్యక్తపరచుకున్న రోజు అని నిహారిక తెలిపారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."