జబర్దస్త్ లో ఊహించని మార్పులు…ఝలక్ ఇచ్చిన నిర్వాహకులు
jabardasth Show :బుల్లితెరపై కామెడీ షోస్ లో జబర్దస్త్ కి గల క్రేజ్ వేరు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో మొదటి నుంచి టి ఆర్పీ లో దూసుకెళ్తూనే ఉంది. ఈ షో డిమాండ్ ఏ రేంజ్ కి వెళ్లిందంటే, 8ఏళ్లుగా ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోను అభిమానించే ప్రేక్షకులు లక్షల సంఖ్యలో ఉన్నారు. జబర్దస్త్ షోకు ప్రేక్షకుల ఆదరణ దక్కడంతో ఈ షో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా బుల్లితెరపై ప్రసారమైంది. ప్రారంభం నుంచి మెగా బ్రదర్ నాగబాబు, రోజా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిగా వ్యవహరించగా, నాగబాబు తప్పుకోవడంతో ఇప్పుడు ఆ ప్లేస్ లో మనో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.
ఇక స్టార్ యాంకర్లు రష్మీ, అనసూయ ఈ షోలకు యాంకర్లుగా వ్యవహరించడంతో పాటు వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలాగే కంటెస్టెంట్స్ కూడా ఆర్ధికంగా ఎదిగారు. పలు షోస్ , మూవీస్ లో ఛాన్స్ లు తెచ్చుకుంటున్నారు. నిజానికి ఈ షోను అనుకరిస్తూ ఇతర ఛానెళ్లు షోలను ప్లాన్ చేసినా అవి పోటీ ఇవ్వడం కాదు కదా, పెద్దగా క్లిక్ కూడా కాలేదు. ఇక ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవు తున్న కామెడీ స్టార్స్ షో మాత్రం జబర్దస్త్ షోకు ధీటుగా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.
అయితే ఈ వారం ప్రసారమైన జబర్దస్త్ షో ఎపిసోడ్లలో ఊహించని మార్పులు ఏర్పడడంతో హాట్ టాపిక్ అయింది. నిజానికి ప్రతి గురు, శుక్రవారాలలో జబర్దస్త్ షోలో ఆరు స్కిట్లు, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ఆరు స్కిట్లు ప్రసారమయ్యేవి. ఇందుకు భిన్నంగా గత గురు,శుక్ర వారాల్లో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఐదేసి స్కిట్లతో ప్రసారమయ్యాయి. మిగిలిన అరగంట సమయంలో గతంలో హిట్ అయిన స్కిట్లు ప్రసారమవ్వడం గమనార్హం. ఇలా కోత విధించి ఆ కమెడియన్లను వేరే టీమ్స్ లో కలిపేసి జబర్దస్త్ నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు ఎవరికీఅంతుబట్టడం అంతుబట్టడం లేదు. ఖర్చు తగ్గించడం కోసం ఇలా చేశారా అనేమాట వినిపిస్తోంది.

