MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu Heroine Nirosha :టాలీవుడ్ లో “న్యాయం కావాలి ” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఘర్షణ, కొబ్బరి బొండాం వంటి సినిమాల్లో నటి నిరోషా చేసిన నటన అద్భుతం. బాలయ్య సరసన నారీ నారీ నడుమ మురారి, మెగాస్టార్ చిరంజీవి సరసన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ వంటి హిట్ చిత్రాల్లో కూడా అగ్రహీరోలతో నటించింది. నటి రాధిక చెల్లెలు ఈమె. 1980 సంవత్సరంలో దూరదర్శన్ ఛానల్ లో చిత్రలహరిలో ప్రసారమయ్యే “బృందావనం సోయగం ” అనే సిమ్మింగ్ ఫుల్ పాట ఇప్పటికీ అందరి మదిలో మెదులుతుంది.

అలాగే ప్రముఖ దర్శకుడు దేవరాజన్ తెలుగులో సింధురపువ్వుగా తెరకెక్కించిన సినిమాతో తెలుగు ప్రజల మన్ననలను నిరోషా అందుకుంది. తమిళ ఇండస్ట్రీలో సింధూరపూవే అనే సినిమాలో హీరో రాంకీ నే నిరోషా ను ఎంపిక చేయడం, తెలుగులో వారిద్దరూ కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను సొంతం చేసుకున్నారు. నిరోషా ఎకాఎకీనా 7 శత దినోత్సవ సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

రాంకీ, నిరోషా జంటగా అనేక సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చివరికి వీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని చివరికి పెళ్లి పీటలు ఎక్కారు. నిజానికి వీరి మధ్య ఓ గమ్మత్తు చోటుచేసుకుంది. సింధూరపువ్వు సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకునే సమయంలో నిరోషా ను దర్శకుడు దేవరాజ్ సెలెక్ట్ చేశారు. హీరో రాంకీ చూసి, ఈ అమ్మాయి ఏంటి అచ్చం పని పిల్లల ఉంది అంటూ కామెంట్ చేసాడట. చివరికి ఆమె అతడి హీరోయిన్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."