MoviesTollywood news in telugu

సౌందర్య బయో పిక్ లో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా?

Telugu Heroine soundarya biopic :చాలామంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. కానీ తన సహజ సిద్ధమైన నటనతో చిరకాలం నిలిచేది కొందరే. ముఖ్యంగా హీరోయిన్స్ లో మహానటి సావిత్రి , జమున, భానుమతి, తర్వాత వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి ఇలా చెప్పుకుంటూ పొతే, వెండితెరపై ఆ స్థాయిలో గుర్తింపు పొందిన నటి గా సౌందర్య కూడా ఉంటుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగు అమ్మాయి అనే స్థాయిలో అందరి మనసులను గెలిచింది. అమ్మోరు లాంటి పాత్రలతో అదరగొట్టిన సౌందర్య దాదాపు అగ్రనటులందరి సరసన చేసింది.

అలాగే చిన్న హీరోల పక్కన నటించడానికి కూడా వెనుకాడలేదు. బాబుమోహన్, అలీ వంటి నటులతో సాంగ్స్ లో స్టెప్పులేసింది. మహానటి సినిమా తర్వాత సౌందర్య బయోపిక్ గురించి కూడా టాక్ వచ్చింది. తాజాగా మరోసారి ఆ బయోపిక్ గురించి టాలీవుడ్ లో హాట్ న్యూస్ వైరల్ అవుతుంది. బయోపిక్ ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేసినట్లు టాక్. అంతేకాదు, సౌందర్య పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్, రష్మికలలో ఒకరిని ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.

తెలుగు నేటివిటీ ఉన్న పాత్రలలో నటించి మెప్పించి, ఫ్యామిలీ కథలకి కేరాఫ్ గా నిలిచిన సౌందర్య కన్నడంలో కన్నా తెలుగులోనే అత్యధిక సినిమాలు చేసింది. తరు వాత తమిళంలో చేసింది. సినిమాల్లో పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని, నటిగా ప్రస్థానం సాగిస్తోంది. ఈలోగా బీజేపీలో చేరడం, ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ, విమాన ప్రమాదంలో మరణించడం తెలుగు ఆడియన్స్ ని కలచివేసింది. అందుకే గతంలో సౌందర్య బయోపిక్ గురించి చర్చ నడిచింది. కీర్తి సురేష్ ని సంప్రదించారనే టాక్ వచ్చింది. అయితే అప్పట్లో కుదరకపోయినా, ప్రస్తుతం సౌందర్య బయోపిక్ తెరకెక్కించ డానికి ఓ బడా నిర్మాత చాపకింద నీరులా సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."