జాతి రత్నాలు నాలుగు రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా ?
Jathi Ratnalu 4 Days Collections : టాలీవుడ్ లో కామెడీ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు ఇదే విషయం మరోసారి రుజువైంది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా చేసిన జాతి రత్నాలు సినిమా పై మొదటినుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి నటించడంతో కామెడీ బాగా పండుతుందని ఈ సినిమా టీజర్ ట్రైలర్ నిరూపించాయి. అలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 44 కోట్ల వసూళ్లను సాధించింది
