MoviesTollywood news in telugu

మన హీరోలు :చేస్తున్న బిజినెస్ లు ఏమిటో చూడండి

Tollywood Heroes business : మన స్టార్ హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.

మహేష్ బాబు ఒకపక్క యాడ్స్ చేస్తూ సినిమాలో హీరోగా నిర్మాతగా చేస్తున్నాడు. మరోవైపు మల్టీప్లెక్స్ బిజినెస్, క్లాత్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. ఈ వ్యవహారాలన్నీ మహేష్ బాబు తో పాటు భార్య నమ్రత కూడా చూసుకుంటుంది

విజయ్ దేవరకొండ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు అలాగే మల్టీప్లెక్స్ నిర్మాణంలోకి అడుగు పెట్టాడు

అల్లు అర్జున్ కూడా సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా స్టార్ట్ చేశాడు హైదరాబాద్ లో ఒక పబ్ ఉంది అలాగే సత్యం థియేటర్ ప్లేస్లో AAA పేరుతో మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది

చిరంజీవి కొడుకు గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు అలాగే ట్రూజెట్ ఎయిర్లైన్స్ మొదలుపెట్టాడు గుర్రాలు అంటే ఆసక్తి ఉండటం వలన పోలో బిజినెస్ కూడా చేస్తున్నాడు

నాగార్జున హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా సినిమాలు చేశారు. అలాగే మాటీవీలో కొంతకాలం భాగస్వామిగా ఉన్నారు. ఓ రేసింగ్ కంపెనీ తో పాటు ఫుట్బాల్ టీమ్ కూడా ఒన్ చేసుకున్నాడు.

చిరంజీవి హీరోగానే కాకుండా బిజినెస్ లో అడుగుపెట్టాడు ఆ మధ్య సచిన్ తో కలిసి ఫుట్బాల్ టీం కొన్నాడు

సందీప్ కిషన్ హోటల్ బిజినెస్ చేస్తున్నాడు. నితిన్ కూడా చాలా బిజినెస్ చేస్తున్నాడు అయితే దీనికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ నితిన్ అక్క చూసుకుంటుంది