MoviesTollywood news in telugu

వరుడు హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో…?

varudu movie heroine bhanu sri mehra :గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన వరుడు సినిమా నిరాశపరిచిన విషయం మనకు తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ గా భానుశ్రీ మెహ్రా నటించింది అయితే సినిమా విడుదలకు ముందు హీరోయిన్ ముఖాన్ని రివిల్ చేయలేదు.ఆమె ఎవరు అనే ఆసక్తితో అందరూ థియేటర్స్ వైపు అడుగులు వేశారు. అయితే సినిమా పరాజయం కావటంతో భాను శ్రీ మెహ్రా కు పెద్దగా అవకాశాలు రాలేదు.

గోవిందుడు అందరివాడేలే, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, అలా ఎలా చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసిన ఈ అమ్మడు గతేడాది నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన కీర్తి సురేష్ సినిమా ‘మిస్ ఇండియా’లో సహానా పాత్రలో మెరిసింది. భాను శ్రీ మెహ్రా గతేడాది కరణ్‌మన్‌హాస్‌ను పెళ్లాడింది.

భర్త సపోర్ట్ తో రీఎంట్రీ కి సిద్దం అయింది. అవకాశాలు వస్తే నటించటానికి సిద్దంగా ఉంది. తెలుగులో అవకాశాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంది భాను శ్రీ మెహ్రా.