స్టార్ హీరోయిన్ వారసురాలు ఎంట్రీ ఇస్తోంది…ఎవరో తెలుసా?
vani viswanath sister daughter varsha :ఇండస్ట్రీలో వారసత్వానికి కొదవలేదు. హీరోల వారసులతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల వారసులు,హీరోయిన్స్ వారసులు కూడా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, గ్లామర్ క్వీన్ వాణీ విశ్వనాథ్ నట వారసురాలిగా చెల్లెలి కూతురు వర్ష కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. వాణీ విశ్వనాథ్ సోదరి ప్రియా విశ్వనాథ్ కూతురు వర్ష ఇప్పటికే వర్ష తమిళంలో ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలలో నటించింది. కేరళ త్రిస్సూర్‌లో ఇంటర్ పూర్తి చేసిన వర్ష పెద్దమ్మ బాటలో హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తోంది.
రెడ్డిగారింట్లో రౌడీయిజం అనే సినిమాతో టాలీవుడ్ లోకి వర్ష అడుగుపెడుతోంది. ఎం.రమేశ్, గోపీ సంయుక్తంగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రమణ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో రెండు చిత్రాలకు ఈ బ్యూటీ సంతకం చేశారు. రెండో చిత్రం హీరో రమణ్‌తో వట్టికూటి చంద్ర దర్శకత్వంలో చేస్తోంది. అలాగే సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరితో ఓ సినిమా చేయడానికి ఒకే చెప్పింది.
మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్తే, సౌత్ లో ఒక వెలుగు వెలిగిన వాణీ విశ్వనాధ్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చిరంజీవి ,వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ తో ఒకప్పుడు ఆడిపాడిన మలయాళీ ముద్దుగుమ్మ. బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ లో సీనియర్ ఎన్టీఆర్ సైతం ఈమె అందానికి దాసోహం అయిపోయాడనే టాక్ అప్పట్లో నడిచింది. చాలా గ్యాప్ తర్వాత జయ జానకీ నాయక సినిమాతో వాణీ విశ్వనాధ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీలో చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలకంగా భాగం కావాలని కూడా భావించింది.

