MoviesTollywood news in telugu

 గిన్నీస్ బుక్ రికార్డ్స్ కొట్టిన తెలుగు సెలబ్రిటీలు ఎంత మంది ఉన్నారో…?

Tollywood Guinness World Records :తెలుగు సినిమా పరిశ్రమలో నిలబడాలంటే అందం, అభినయం తో పాటు అదృష్టం కావాలి. ఇక అరుదైన రికార్డులు, అవార్డులు రావాలంటే చాలా శ్రమించాలి. సినిమాకు అవార్డు వస్తేనే చాలా పొంగిపోవడం సహజం. అయితే ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కాలంటే ఎంత కృషి , పట్టుదల దాగి ఉంటాయి. ఆరుగురు సెలబ్రిటీలు గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు.  అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల 2000లోనే గిన్నీస్ రికార్డు సాధించారు.

చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చిన ఈమె హీరోయిన్ గా చేయడంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 42సినిమాలను డైరెక్ట్ చేసి, రికార్డు క్రియేట్ చేసారు. ఇక స్క్రీన్ మీద కనిపిస్తే చాలు , పగలబడి నవ్వేసేలా తన తన నటనతో అదరగొట్టిన బ్రహ్మానందం లెజెండ్ గా ఎదిగారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించినందుకు 2010లో గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు ఎక్కువ సినిమాలు నిర్మించడమే కాకుండా, అన్ని భాషాల్లో చిత్రాలు నిర్మించిన ఘనత సాధించి, 2008లో గిన్నీస్ బుక్ లో ఎక్కారు.

13భాషల్లో 150కి పైగా సినిమాలు నిర్మించారు.  గత ఏడాది దివగంతులైన గానగంధర్వులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 40వేల సాంగ్స్ పాడి రికార్డ్ క్రియేట్ చేసారు. 2001లో బాలు గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు.   గానకోకిల సుశీల 18వేల సాంగ్స్ ఆలపించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. గజల్స్ బాగా ఆలపించే గజల్ శ్రీనివాస్ 100భాషల్లో గజల్స్ పాడిన ఘనత సాధించి, గిన్నీస్ బుక్ లో2008లో  చోటుదక్కించుకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."