MoviesTollywood news in telugu

సినిమా ప్లాప్ అన్నపదానికి అర్ధం తెలియని డైరెక్టర్స్ ఎంత మంది ఉన్నారో…?

Most Successful Directors in Indian Cinema :ఎంత ఖర్చు పెట్టి తీసినా, ఎంతమంది స్టార్స్ ని పెట్టి తీసినా ఆ సినిమా హిట్ కావాలన్నా, ప్లాప్ గా మిగలన్నా ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది. అయితే ఆడియన్స్ నాడి పసిగట్టి సినిమాలు తీసే దర్శకులకు అపజయం ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఇలా సక్సెస్ సాధించిన దర్శకులు ఉన్నారు. వాళ్ళల్లో ముందుగా ప్రస్తావించాలంటే, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసి,శాంతినివాసం సీరియల్ తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసాడు. ఇక సిల్వర్ స్క్రీన్ మీద జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ స్టార్ట్ చేసారు. అక్కడ నుంచి ఏ హీరోతో తీసినా హిట్ మీద హిట్ అందుకుంటూ సింహాద్రి, ఛత్రపతి, సై, విక్రమార్కుడు,మగధీర,ఈగ,మర్యాదరామన్న ఇలా అన్ని హిట్స్ .ఇక బాహుబలితో వరల్డ్ వైడ్ గా అతడి పేరు మారుమోగింది.

డైరెక్టర్ కొరటాల శివ.. భద్ర, సింహా లాంటి మూవీస్ కి కథలను అందించి, మిర్చి మూవీతో డైరెక్టర్ గా మారి బ్లాక్ బస్టర్ కొట్టాడు. శ్రీమంతుడు, జనతా గారేజ్, భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ మూవీస్ అందించాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్నాడు. అయితే యువదర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇప్పటివరకూ హిట్స్ అందుకుంటూ సక్సెస్ ఫుల్ జాబితాలో కి వచ్చేసాడు.

గోపీచంద్ నటించిన శంఖం మూవీతో డైలాగ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనిల్ కందిరీగ, ఆగడు మూవీస్ కి మాటల సహాయం అందించాడు. 2015లో కళ్యాణ్ రామ్ తో తీసిన పటాస్ అనే బ్లాక్ బస్టర్ మూవీతో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసాడు. సాయిధరమ్ తేజ్ తో సుప్రీం, రవితేజతో రాజాధి గ్రేట్ తీసి హ్యాట్రిక్ కొట్టాడు. వెంకటేష్,వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2లాంటి సూపర్ హిట్ మూవీ అందించి, సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఎఫ్ 3తీస్తున్నాడు. కామెడీని తనదైన శైలిలో పండించడంలో దిట్ట.

తమిళంలో ధనుష్ హీరోగా పొల్లగాం మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వెట్రిమారెన్,రెండో సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ గా నిలబడ్డాడు. విచారణై మూవీ ఇతడి పనితనానికి నిదర్శనం. తెలుగులో విచారణ పేరిట రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. ఇక ధనుష్ హీరోగా వచ్చిన అసురన్ మూవీకి డైరెక్ట్ చేసి, బ్లాక్ బస్టర్ కొట్టాడు. అదే సినిమాను తెలుగులో వెంకటేష్ నారప్పగా రీమేక్ చేస్తున్నారు. మలయాళీ దర్శకురాలు అంజనా మీనన్ కూడా హిట్ మీద హిట్ అందుకున్నారు. బెంగుళూర్ డేస్, కూడై, ఉస్తాద్ హోటల్ ఇలా ప్రతి సినిమా హిట్. బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరానీ ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా నిలిచాడు. మిషన్ కాశ్మీర్ మూవీతో ఎడిటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి,మున్నాభాయి ఎంబిబిఎస్, త్రి ఇడియట్స్,పీకే,సంజు వంటి సినిమాలతో హిట్ మీద హిట్ అందుకుని, ఫిలిం ఫేర్ అవార్డులు కూడా దక్కించుకున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."