MoviesTollywood news in telugu

అలనాటి నటి సూర్యకాంతంకి వచ్చిన భాషలెన్నో తెలుసా ?

Tollywood Actress Suryakantham : గయ్యాళి అత్త పాత్రలతో తెలుగునాట తనదైన ముద్ర వేసిన సూర్యకాంతం ఎంతంగా పాపులర్ అయిందంటే,తమ ఇళ్లల్లో ఎవరికీ సూర్యకాంతం పేరు పెట్టడానికి భయపడే పరిస్థితికి వచ్చేసింది. అంతగా అందరి హృదయాలలో తన పాత్రలతో సూర్యకాంతం చెరగని ముద్రవేసుకుంది. 1994లో ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించినా ఇంకా ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారు. అయితే సినిమాల్లో గయ్యాళి పాత్రలు వేసినప్పటికీ నిజ జీవితంలో ఆమె మనసు వెన్న అని అంటారు. అందరికీ స్వయంగా భోజనాలు,వంటకాలు చేసి తెచ్చి పెట్టేవారని అంటారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఆమె వంటను ఇష్టంగా తినేవారట.

సూర్యకాంతానికి ఆరేళ్ళ వయస్సు ఉండగానే తాతగారు చనిపోవడంతో పెద్ద అక్క, బావ దగ్గర పెరిగిందని సూర్యకాంతం కుమారుడు పద్మనాభ మూర్తి ఆ మధ్య ఓ ఇంటర్యూలో చెప్పారు. సినిమాలో పాత్రలకు,నిజ జీవితానికి పొంతనలేదని, నిజంగా ఆమె సౌమ్యురాలని పేర్కొన్నారు. నారద నారది మూవీ ద్వారా 1946లో ఇండస్ట్రీకి వచ్చిన సూర్యకాంతం హీరోయిన్ గా చేయాలనుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ఇక 1962నాటి గుండమ్మ కథ మూవీతో గయ్యాళి పాత్రలకు కేరాఫ్ ఎడ్రెస్ అయింది.

ఎన్నో సినిమాల్లో తన నటనతో చెరగని ముద్రవేసిన సూర్యకాంతం పుస్తకాలను ఎక్కువ చదవడంలో దిట్ట. ఇక చేతికి ఎముక లేదన్నట్లు దాన ధర్మాలు చేసేవారని, చిన్న పత్రికలకు చేయూతనిచ్చేవారని పద్మనాభామూర్తి చెప్పుకొచ్చారు. శత్రువు అయినా సరే ఇంటికొస్తే ఆదరించి భోజనం పెట్టేవారట. ఇక ఆమెకు బ్లాక్ కలర్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఒకేసారి బ్లూ కారు బుక్ చేస్తే, బ్లాక్ కారు పంపడంతో గొడవపెట్టి మరీ మార్పించారట. ఇక పది భాషలను సూర్యకాంతం అనర్గళంగా మాట్లాడేవారట. సూర్యకాంతం కొడుకుగా చెప్పుకోడానికి గర్వంగా ఉంటుందని పద్మనాభ మూర్తి చెప్పారు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."