MoviesTollywood news in telugu

అత్యధిక కాలం షూటింగ్ జరుపుకున్న తెలుగు సినిమాలు

Tollywood Movies :కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కానీ కొన్ని బాగా ఆలస్యమైపోతాయి. కొన్ని 20,30రోజుల్లో పూర్తయితే, కొన్ని 50,100,200రోజులు కూడా పట్టేసాయి. ఇంకా చెప్పాలంటే సంవత్సరాల తరబడి ఎక్కువ సమయం తీసుకున్న మూవీస్ ఉన్నాయి. అలా ఎక్కువకాలం షూటింగ్ సాగిన చిత్రాల విషయంలోకి వెళ్తే,తొలితరం టాలీవుడ్ సూపర్ స్టార్ గా చెప్పుకునే చిత్తూరు వి నాగయ్య నటించిన భక్త రామదాసు 1957లో షూటింగ్ ఆరంభమై,ఆర్ధిక సమస్యలు,నటీనటుల గొడవలతో సినిమా పూర్తికావడానికి ఏడేళ్లు పట్టింది. 1964లో రిలీజయింది. అత్యధికకాలం సినిమా షూటింగ్ సాగిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ఎన్టీఆర్ నటించిన లవకుశ 1958లో షూటింగ్ ప్రారంభమై, 1963లో రిలీజయింది. 5లక్షల బడ్జెట్ తో మొదలైన ఈ మూవీ కలర్ తదితర కారణాలతో 50 లక్షలకు చేరింది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1997లో షూటింగ్ మొదలై,రకరకాల కారణాలతో 6న్నర సంవత్సరాల సమయం పట్టింది. 450 పనిదినాలు పట్టిన సినిమా ఇది.

అమ్మోరు సినిమా గ్రాఫిక్స్ మూవీస్ కి టాలీవుడ్ లో బాటలు వేసింది. 1992లో షూటింగ్ స్టార్ట్ చేసి,1995లో పూర్తిచేసుకుని,రిలీజయింది. ఒకసారి తీసిన సినిమా మొత్తం తొలగించి, రెండోసారి మళ్ళీ ఈ సినిమా తీశారు. సౌందర్య 3వ సినిమాగా స్టార్ట్ అయిన ఈ మూవీ సౌందర్య 27వ సినిమాగా రిలీజయింది. ఇక రెండు భాగాలుగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి 2013లో స్టార్ట్ చేస్తే, 4ఏళ్ళు పట్టింది. తెలుగులో వందల కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. కథకు సంబందించిన అంశాలు, గ్రాఫిక్స్ వలన ఆలస్యమైంది.

అలాగే 2006లో షూటింగ్ స్టార్ట్ చేసిన అరుంధతి 2009లో రిలీజయింది. బడ్జెట్ సమస్యలతో షూటింగ్ ఆలస్యమైంది. షూటింగ్ లో ప్రమాదాలు, బడ్జెట్ లో మార్పులు,బాలయ్య, విజయశాంతి మధ్య ఇగో సమస్యలు వెరసి 1991నుంచి రెండేళ్లపాటు నిప్పురవ్వ షూటింగ్ సాగింది. అలాగే బాలయ్య గాండీవం మూవీ 1992లో షూటింగ్ స్టార్ట్ అయి,ఆర్ధిక కారణాలతో రెండేళ్లపాటు షూటింగ్ నడిచింది. నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్య మూవీ రెండున్నరేళ్లు షూటింగ్ జరుపుకుంది.

ఇక సాహో,సైరా మూవీస్ కూడా రెండేళ్లు షూటింగ్ నడిచాయి. బాలయ్య భైరవద్వీపం, నాగార్జున రక్షకుడు, ఆకాశవీధిలో, వెంకటేష్ దేవీపుత్రుడు, పవన్ కళ్యాణ్ కొమరం పులి, మహేష్ బాబు ఒక్కడు, ఖలేజా,ఎన్టీఆర్ అదుర్స్ రామ్ చరణ్ మగధీర ఒకటిన్నర ఏళ్ళు పట్టాయి. ప్రభాస్ తాజా మూవీ రాధేశ్యాం కూడా ఒకటిన్నరేళ్ళు పట్టింది. ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక రాజమౌళి తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండున్నరేళ్లుగా షూటింగ్ దశలోనే ఉంది. ఇంకా సమయం పడుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."