రొటీన్ కి భిన్నంగా వెళుతున్న హీరోయిన్స్…సక్సెస్ అవుతారా…!?
Tollywood Heroines :ఇప్పటివరకు ఓ లెక్క ఇక నుంచి మరోలెక్క అనుకున్నట్లుగా కొందరు హీరోయిన్స్ నడుచుకుంటున్నారు. కొందరు ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తుంటే, మరికొందరు ప్రాధ్యాన్యం గల పాత్రల్లో రాణించాలని భావిస్తున్నారు. గమనం,స్కైలాబ్ వంటి మూవీస్ లో చేస్తున్న మలయాళీ భామ నిత్యా మీనన్ నటనకు ప్రాధాన్యం గల పాత్రలవైపు మొగ్గుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,దగ్గుపాటి రానా నటిస్తున్న రీమేక్ మూవీలో ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుందని టాక్.
స్టార్ హీరోల సరసనే నటిస్తానని ఇప్పటివరకూ మొండికేసి కూర్చున్న ఇమ్మానుయెల్ ఇప్పుడు ఎవరి సరసనైనా సరే అంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించిన ఈ అమ్మడు తాజాగా అల్లు శిరీష్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీతో వచ్చిన వకీల్ సాబ్ మూవీ మంచి ఆదరణ పొందింది. ఇందులో నటించిన నివేధా థామస్ తాజాగా శాకిని డాకిని అనే మూవీకి కమిట్ అయిందట. 18పేజెస్ మూవీతో పాటు దిల్ రాజు నిర్మించే రౌడీ బాయ్స్ మూవీలో కూడా నటించడానికి అనుపమ పరమేశ్వరన్ ఒకే చెప్పిందని అంటున్నారు.
ఇక కరోనా సమయంలో పెళ్లి చేసుకుని, ఆచార్య సినిమా షూటింగ్ లో జోరుగా పాల్గొంటున్న కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ తెరమీద తన అందచందాలతో మెప్పిస్తూ వచ్చింది. అయితే కొత్తరకం పాత్రలు వేయాలని భావిస్తోంది. నాగ్ , ప్రవీణ్ సత్తార్ కాంబోలో మూవీలో చేస్తున్న ఈ భామ వెబ్ సిరీస్ కి కూడా ఒకే చెప్పిందని టాక్. నిశ్చితార్ధం అయ్యాక పెళ్లికొడుక్కి కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడడంతో మరికొన్ని సినిమాలు చేయాలని హీరోయిన్ మెహ్రిన్ భావిస్తోంది. ఇప్పటికే ఎఫ్ 2సీక్వెల్ లో చేస్తోంది. మొత్తానికి గ్లామర్ కోసం కొందరు హీరోయిన్స్ తపిస్తుంటే, జనం హృదయాల్లో నిలిచే పాత్రల్లో చేయాలని మరికొందరు ఉవ్విళ్లూరుతున్నారు.

