MoviesTollywood news in telugu

బెల్లంకొండ శ్రీనివాస్ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల ఆస్తి…?

Tollywood Hero Bellamkonda Sai Sreenivas :ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 1993జనవరి 3న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో బెల్లంకొండ సురేష్, పద్మ దంపతులకు జన్మించాడు. ప్రస్తుతం ఇతడికి 28ఏళ్ళు. ఇతడిని శ్రీను, బాబు అనే ముద్దుపేర్లతో పిలుస్తారు. ఇతడికి సాయి గణేష్ అనే సోదరుడు ఉన్నాడు. అల్లుడు శీను మూవీతో హీరోగా వచ్చి తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని భారతీయ విద్యాభవన్ లో చదువుకున్నాడు.

యు ఎస్ లోని లాస్ ఏంజిల్స్ లోగల లీస్టార్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శ్రీనివాస్ చదువుకున్నాడు. చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టంతో తండ్రితో పాటు షూటింగ్స్ కి వెళ్లడం, సినిమాలు చూడడం చేసేవాడు. హీరోగా చేస్తానని తండ్రితో చెప్పడంతో స్టడీస్ అయ్యాక అని బదులిచ్చారు. దీంతో యాక్టింగ్ కోర్సు పూర్తిచేసిన శ్రీనివాస్ 20ఏళ్ళ వయస్సులోనే వివి వినాయక్ డైరెక్షన్ లో అల్లుడు శీను మూవీతో 2014లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

2016లో స్పీడున్నోడు, 2017లో జయ జానకి నాయక , 2018లో సాక్ష్యం, 2019లో రాక్షసుడు, తాజాగా అల్లుడు అదుర్స్ మూవీస్ తో హీరోగా శ్రీనివాస్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలిసినిమాకు 1.2కోట్లు రెమ్యునరేషన్ అందుకోగా, రాక్షసుడు మూవీకి 7.3కోట్లు తీసుకున్నాడు. హీరో ప్రభాస్ ఇష్టమైన హీరో. అభిమాన హీరోయిన్ సమంత. ఇష్టమైన ప్రదేశం ఢిల్లీ. యాక్టింగ్,డాన్స్,స్విమ్మింగ్ అంటే ఇష్టం. నెట్ వర్త్ 280కోట్లు ఉంటుంది. ఇతడికి మూడు అధునాతన కార్లు ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మూడు కోట్ల విలువైన ఇల్లు ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."