ఇంటిలో సులభంగా రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోవచ్చు…ఎలా…?

Immunity In telugu :కరోనా మహమ్మారి వచ్చి సంవత్సరం దాటి పోయింది. సెకండ్ వేవ్ కూడా వచ్చి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కరోనా ఎంతలా భయపెడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చినా వ్యాక్సిన్ కొరత ఉంది. వ్యాక్సిన్ వచ్చినా ప్రారంభంలో ఎవరు వేసుకోవటానికి ముందుకి రాలేదు.

కరోనా సెకండ్ వేవ్ వచ్చాక వ్యాక్సిన్ వేయించుకోవటానికి క్యూ కడుతున్నారు. దాంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందరూ వేయించుకుంటే కొంతమేర కరోనా కంట్రోల్ అవుతుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.

బయటకు వెళ్లి పనులు చేసుకోవాలంటే తప్పనిసరిగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇంటిలో సులువుగా అందుబాటులో ఉండే వెల్లుల్లి,అల్లం వంటి వాటితో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. ఇవి వ్యాధుల మీద పోరాటం చేస్తాయి. ఇక అల్లంలో ఉండే లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పాలకూరలో విటమిన్ సి, అలాగే కొన్ని యాక్సిడెంట్స్ లభిస్తాయి. విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం శరీరానికి ప్రస్తుత కాలంలో చాలా అవసరం.