Healthhealth tips in telugu

అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరగాలంటే ఈ టీ తాగాల్సిందే…

Clove Tea weight Loss :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అందుకే బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండదు.ఇప్పుడు చెప్పే టీ తాగితే చాలా సులభంగా బరువు తగ్గొచ్చు.
Diabetes tips in telugu
ఆయుర్వేదానికి మన భారత దేశం పుట్టినిల్లు. ఆయుర్వేదం ద్వారా ఎన్నో రకాల వ్యాధులు నయం అవుతాయి. లవంగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ లవంగాలను ఉపయోగించి టీ తయారు చేసుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

మసాలా దినుసుగా ఉపయోగించే లవంగాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో అనవసర కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా ప్రోత్సహించి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. ప్రతిరోజు లవంగాలతో తయారుచేసిన టీ తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వు అంతా కరిగి పోతుంది.అలాగే పొట్ట తగ్గిపోతుంది.

లవంగాల టీ తయారు చేయడం చాలా సులభం ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి ఐదు నుంచి ఆరు లవంగాలు,చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడకట్టి దానిలో అర స్పూన్ తేనె., ఒక స్పూను నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. అప్పుడే మంచి ఫలితం కనబడుతుంది. బరువు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది..

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.