Healthhealth tips in telugu

పిల్లలు, పెద్దల్లో ఇమ్యూనిటీ పెంచే అద్భుతమైన డ్రింక్.. అర గ్లాసు తాగితే చాలు!

Immunity Drink Benefits :పిల్లలు, పెద్దల్లో ఇమ్యూనిటీ పెంచే అద్భుతమైన డ్రింక్.. అర గ్లాసు తాగితే చాలు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవలసిన అవసరం ఉంది.

అలాగే దగ్గు, గొంతులో శ్లేష్మం తగ్గించుకోవడానికి ఈ రోజు ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ సమస్య ఉన్నప్పుడు శ్వాసలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే ఎటువంటి సమస్యలు ఉండవు
Weight Loss Drink In Telugu Dalchina Chekka
ప్రతీ ఒక్కరికీ రోగనిరోధక శక్తి ఎంత ఇంపార్టెంటో తెలిసిపోయింది. ఆ కారణంగానే మార్కెట్లోకి రోగనిరోధక శక్తిని పెంచే అనేక ఆహారాలు, పానీయాలు లభ్యం అవుతున్నాయి.

జలుబు, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలని తగ్గించడానికి రోగనిరోధక శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే చాలా వాటిల్లో సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి.

ఈ డ్రింక్ తయారుచేసుకోవటానికి అవసరం అయినా అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు ఇంటిలో అందుబాటులో ఉంటాయి. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడెక్కాక దానిలో చిన్న అల్లం ముక్క, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి లేదా ఒక అంగుళం దాల్చినచెక్క వేసి 2 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత పావుస్పూన్ పసుపు వేసి మరో 2 నిమిషాలు మరిగించాలి.

బాగా మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి దానిలో అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని ఉదయం,సాయంత్రం తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తాగవచ్చు.

మందులు వాడటం కంటే… మూలికలు వాడటం మేలన్న విషయం మనకు తెలిసిందే. ఈ డ్రింక్ తాగితే… ఇన్ఫెక్షన్లు రావు. జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరంలో విష వ్యర్థాలు బయటకు పోతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."