MoviesTollywood news in telugu

జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Ntr Movies :సినిమాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు దెబ్బలు తగలడం సాధారణమే. అయితే కొన్నిసార్లు తక్కువ గాయాలు,కొన్ని సార్లు తీవ్రమైన గాయాలు కారణంగా ప్రాణాల మీదికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో గాయపడిన సినిమాల గురించి తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో గాయాలు అవటంతో కొన్ని రోజులు షూటింగ్ కి రాలేకపోయాడు.

వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాలో ఒక భారీ ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు మోచేతికి గాయం అయింది. మోచేతికి కట్టు కట్టుకుని ఒక సాంగ్ చేశాడు ఆ సినిమాలో.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో క్లైమాక్స్ సమయంలో గాయం అయింది అయినా షూటింగ్ కంటిన్యూ చేశాడు

వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సాంబ సినిమాలో 40 మంది ఫైటర్లతో యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు దెబ్బలు బాగా తగిలాయి

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో రోప్ కట్టుకున్న సమయంలో మరియు ఒక సాంగ్ లో గాయాలయ్యాయి

వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమా చేస్తున్నప్పుడు పార్టీ ప్రచారం కోసం ఎన్టీఆర్ వెళ్ళాడు ఆసమయంలో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం సినిమా లో క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ కి గాయాలయ్యాయి

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఊసరవెల్లి సినిమాలో ఎమోషనల్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు గాయాలు అయ్యాయి

మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి సినిమాలో కూడా తీవ్రంగా గాయపడ్డాడు

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న RRR సినిమా షూటింగ్ లో భారీ యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ కి గాయాలు అయ్యాయి

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."