భోజనం చేశాక కేవలం 10 నిమిషాలు నడిస్తే చాలు.. మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
walking after eating Benefits In telugu :ప్రతిరోజు నడిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడవచ్చు. శరీరం ఫిట్ గా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నడకను అలవాటుగా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలామంది భోజనం చేయగానే టీవీ ముందు కూర్చోవడమో, ఫోన్ చూస్తూ పడుకోవడమో చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక.. బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
కానీ, భోజనం చేసిన తర్వాత కేవలం ఓ పది నిమిషాలు నడిస్తే (Post-meal walk) మీరు ఊహించని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం

అయితే ఏ సమయంలో నడిస్తే మంచి ఫలితం వస్తుందో తెలుసుకుందాం. భోజనం చేసిన తర్వాత కేవలం పది నిమిషాల పాటు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలాగే భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.

అందువల్ల తిన్న తరువాత పది నిమిషాలు నడిస్తే కడుపుబ్బరం తగ్గటమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడి గ్యాస్,ఎసిడిటీ వంటి సమస్యలు రావు. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు చేరదు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

మధుమేహం (షుగర్ వ్యాధి) ఉన్నవారికి ఇది ఒక బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తుంది. భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఈ 10 నిమిషాల నడక కంట్రోల్ చేస్తుంది.
తిన్న వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల మనం తీసుకున్న క్యాలరీలు కొవ్వుగా మారి పొట్ట చుట్టూ పేరుకుపోతాయి. అదే కాస్త నడిస్తే.. క్యాలరీలు ఖర్చయ్యి బరువు పెరగకుండా ఉంటారు.
ఒత్తిడి ఆందోళన టెన్షన్ వంటివి కూడా తొలగిపోతాయి. అయితే భోజనం చేసిన తర్వాత వేగంగా నడవకుండా నిదానంగా నడవాలి. వేగంగా నడిస్తే కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే కేవలం పది నిమిషాలు లేదా 15 నిమిషాలు మాత్రమే నడవాలి. ఎక్కువ సమయం నడవకూడదు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
ముఖ్య గమనిక: భోజనం చేసిన వెంటనే పరిగెత్తడం లేదా వేగంగా నడవడం (Brisk walk) అస్సలు చేయకూడదు. కేవలం నెమ్మదిగా, రిలాక్స్‌డ్‌గా అడుగులు వేస్తూ మాత్రమే నడవాలి. ఇంట్లో అయినా, డాబా పైన అయినా ఓ పది నిమిషాలు నడవడం ఈరోజు నుంచే అలవాటు చేసుకోండి!
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Source: chaipakodi.com

