Healthhealth tips in telugu

రోజుకో కప్పు కాకరకాయ టీ.. ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు!

Bitter gourd tea benefits In telugu :రోజుకో కప్పు కాకరకాయ టీ.. ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు.. మనలో చాలా మంది కాకరకాయ అంటే ఇష్టపడరు. కాకరకాయలు చేదుగా ఉండడమే అందుకు కారణం.

అయితే కాకరకాయ ఎన్నో పోషకాలను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాకరకాయ తినని వారు కాకరకాయతో టీ తయారు చేసుకుని తాగితే సరిపోతుంది.

ఈ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కాకరకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఈ ఎండిన కాకరకాయ ముక్కలను నిలవ చేసుకోవచ్చు.

ఒక గిన్నెలో నీటిని పోసి కొన్ని ఎండిన కాకరకాయ ముక్కలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడగట్టి ఒక స్పూన్ నిమ్మరసం., ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి.

డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తేనే వాడకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. శరీరంలోని విషాలను తొలగించి అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.

అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. .

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. ప్రతిరోజు కాకరకాయతో తయారుచేసిన టీ తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలు పొందండి..

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."