MoviesTollywood news in telugu

స్వర్ణ ప్యాలెస్ సీరియల్ హీరోయిన్ కుందన తల్లి ఏమి చేస్తుందో తెలుసా?

swarna palace serial heroine kundana :తెలుగు బుల్లితెరపై సిరియల్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా జి తెలుగులో స్టార్ట్ చేసిన స్వర్ణ ప్యాలెస్ సీరియల్ కి కూడా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులోని నటీ నటులు తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ప్రజాదరణతో రాణిస్తున్న ఈ సీరియల్ లో హీరోయిన్ గా కుందన తన అందంతో,నటనతో అలరిస్తోంది.

నిజానికి జి తెలుగులో గతంలో వచ్చిన వరూధిని పరిణయం సీరియల్ లో వరూధిని గా నటించి, తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి తొలి సీరియల్ తోనే పాపులార్టీ తెచ్చుకుంది. దేవయాని,పవిత్ర బంధం సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన కుందన అసలు పేరు చందన సేగు. 1993నవంబర్ 26న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఆర్ ఎన్ గుప్తా, సరస్వతి గుప్తా లకు జన్మించిన ఈమె చిన్నప్పటి నుంచి వెస్ట్రన్ , కర్ణాటక సంగీతం నేర్చుకుంది.

చందన తల్లి క్లాసికల్ మ్యూజిక్ టీచర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించారు. మోడల్ గా,సింగర్ గా,నటిగా రాణిస్తున్న చందన డిగ్రీ పూర్తిచేసింది. స్టడీస్ సమయంలోనే సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసి, గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కన్నడ సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు వేయడమే కాకుండా, షార్ట్ ఫిలిమ్స్ ,టెలీఫిల్మ్స్, మూవీస్ లో నటించింది. తమిళంలో కూడా రెండు సీరియల్స్ నటించింది. రాధమ్మ కూతురు,సూర్యకాంతం సీరియల్స్ లో కూడా గెస్ట్ రోల్స్ వేసింది. ఈమె మంచి పెయింటింగ్ కూడా వేస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."