MoviesTollywood news in telugu

హీరో ఎవరైనా కండీషన్స్ అప్లై అంటున్న రష్మిక..ఏమిటో…?

Tollywood Heroine rashmika mandanna : తెలుగులో ఇప్పుడు వినిపించే యంగ్ స్టార్ హీరోయిన్స్ లో పూజ హెగ్డే, రష్మిక మందన్న పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్యా నువ్వా నేనా అనే పోటీ ఉందని కూడా టాక్. పోటాపోటీగా నటిస్తూ ఇద్దరూ హిట్స్ అందుకుంటున్నారు. అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మరోపక్క దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలన్న ఉద్దేశ్యంతో రెమ్యునరేషన్స్ కూడా పెంచేస్తున్నారు.

రష్మిక విషయానికి వస్తే, సరిలేరు నీకెవ్వరూ మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కల్సి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నితిన్ తో కల్సి చేసిన భీష్మ మూవీతో కూడా హిట్ కొట్టేసింది. అంతకుముందు విజయ్ దేవరకొండలో కల్సి చేసిన గీతగోవిందం మూవీ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఇలా హిట్స్ అందుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో కల్సి పుష్ప మూవీలో చేస్తోంది.

అయితే వినోదంతో పాటు ఎమోషన్ కూడా తన పాత్రలో ఉండాలని తాజాగా కమిట్ అయ్యే సినిమాలకు రష్మిక కండీషన్స్ పెడుతోందట. అయితే తన తొలిసినిమా కిరాక్ పార్టీ నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నానని, కొత్తగా పెట్టిన కండీషన్లు కాదని అంటోంది. అయినా హీరోయిన్ గా పదికాలాలపాటు నిలబడాలంటే ఇలాంటివి పాటిస్తే మంచిదేనని కూడా అంటోంది. అన్నట్టు ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చురుగ్గానే ఉంటోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."