MoviesTollywood news in telugu

అందాల నటి శ్రీదేవికి ఎన్నికోట్ల ఆస్తి ఉందో తెలుసా ?

Tollywood Actress sridevi net worth :బాలనటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, పెద్దయ్యాక హీరోయిన్ గా చేసి, వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగి, తెలుగు,తమిళ,హిందీ తదితర భాషల్లో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి శ్రీదేవి చివరి వరకూ సినిమాల్లో నటించింది. తెలుగులో అగ్ర హీరోల సరసన మూడు తరాల హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్ శ్రీదేవి. అందం,అభినయం కలగలసిన ఈమె లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో సైతం రాణించింది.

గ్లామర్ హీరోయిన్ గా వెండితెరను ఏలిన శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో జన్మించింది. దుబాయ్ లో ఒక వేడుకకు హాజరైన శ్రీదేవి2018డిసెంబర్ 24న ప్రమాదవశాత్తూ మరణించింది. అయితే ఈమెకు పెద్దఎత్తున ఇన్సూరెన్స్ ఉండడం వలన ఈమె మృతికి కారణంగా అప్పట్లో రకరకాల కథనాలు కూడా వచ్చాయి. అయినా మిస్టరీ వీడలేదు. ఇక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

రెండో కూతురు ఖుషి కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. దాదాపు 30ఏళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి ఆ మధ్య ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి మూవీలో శివగామి పాత్రకు సెలక్ట్ చేయాలని చూస్తే, కొన్ని కారణాల వలన కుదరలేదు. దాంతో రమ్యకృష్ణకు ఆ ఛాన్స్ దక్కింది. శ్రీదేవి తండ్రి ఒకప్పుడు న్యాయవాదిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక శ్రీదేవి ఆస్థి లెక్కేస్తే దాదాపు 250కోట్ల పైమాటేనని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."