Healthhealth tips in telugu

ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో తెలుసా… ఈ జాగ్రత్తలు లేకపోతే…

Fatty liver problem In Telugu : మన శరీరంలో లివర్ అతి పెద్ద అవయవం ఇది అనేక రకాల పనులను జీవక్రియలను నిర్వహించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది అలాగే మన శరీరం. పోషకాలను గ్రహించడం,శరీరానికి శక్తిని అందించడం వంటివి లివర్ చేయటం వలన మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని కారణాల వలన లివర్ లో కొవ్వు పేరుకుపోతుంది అప్పుడు ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది.

ఈ ప్యాటి లివర్ సమస్యలు రెండు రకాలు ఉంటాయి. మద్యం ఎక్కువగా సేవించడం వలన ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది కొన్ని కారణాల కారణంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది. ఇది కామెర్లు సోకిన వారిలోనూ,వంశపారంపర్యంగా,కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్న వారిలోనూ,అధిక బరువు ఉన్న వారిలోనూ,డయాబెటిస్, రక్తపోటు సమస్యలు ఉన్నవారిలో ఈ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.

ఈ సమస్య ఉన్నప్పుడు ఆకలి లేకపోవటం,నీరసం,అలసట,బరువు తగ్గడం, చర్మంపై దురదలు, చర్మం కళ్లు పసుపుపచ్చ రంగులోకి మారడం, ఆందోళన, పాదాల వాపులు వంటివి కనిపిస్తూ ఉంటాయి ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఫ్యాటీ లివర్ సమస్యగా అనుమానించి డాక్టర్ ని తప్పనిసరిగా సంప్రదించాలి. డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ కొన్ని చిట్కాలను పాటిస్తే తొందరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

మన శరీరంలో లివర్ కుడి వైపున ఉంటుంది కాబట్టి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి

ప్రతి రోజూ ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తేనెతో కలిపి తీసుకుంటే లివర్ శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటుంది

రెండు టీ స్పూన్ల అల్లం రసం తీసుకున్న లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. అలాగే మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అయ్యాక పలుచని మజ్జిగ ఒక గ్లాసు తీసుకుంటే చాలా మంచిది

భోజనం అయ్యాక 15 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేయాలి

ఈ జాగ్రత్తలను పాటిస్తూ డాక్టర్ చెప్పిన విధంగా మందులను వాడుతూ ఉంటే చాలా త్వరగా ఫ్యాటీ లివర్ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు