MoviesTollywood news in telugu

శ్రీదేవి సోడా సెంటర్ ఎంత బిజినెస్ చేసిందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

sudheer babu sridevi soda centre Movie :సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కరుణ కుమార్ డైరెక్షన్ లో శ్రీదేవి సోడా సెంటర్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో ఆ అమ్మాయి గురించి చెప్పాలి మూవీస్ లో నటిస్తున్నాడు. ఇందులో శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఆనంది హీరోయిన్ గా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ మూవీని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈనెల 27న సినిమా థియేటర్లలో రిలీజ్ చేయడానికి సీనియర్ నిర్మాత లక్ష్మణ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది వచ్చిన జాతిరత్నాలు మూవీని కూడా ఈయనే రిలీజ్ చేసారు. అది లాభాలు తేవడంతో ఇప్పుడు సుధీర్ సినిమా కొన్నారని అంటున్నారు.

ఇక శ్రీదేవి సోడా సెంటర్ 12కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని, ప్రొడ్యూసర్ లక్ష్మణ్ ఈ మేరకు కొనుగోలు చేసారని టాక్. ఈ మూవీలో లైటింగ్ సూరిబాబు పాత్రలో నటించిన సుధీర్ బాగా ఆకట్టుకుంటాడని అంటున్నారు. ఈ మూవీకి మణిశర్మ బాణీలు అదనపు ఆకర్షణ కాగలవని చెబుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."