MoviesTollywood news in telugu

సాయికిరణ్ సినిమాలకు దూరం కావటానికి కారణం అమెనా…?

Telugu Tv Actor Sai Kiran :ప్రస్తుతం బుల్లితెర మీద బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సాయికిరణ్ మొదట్లో సినిమాల్లో చేసాడు. కానీ క్రమంగా బుల్లితెరకు దగ్గరై, ఆడియన్స్ దృష్టిలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొత్తానికి ఇతడికి సినిమా జీవితం నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు ఇక సహజంగా వచ్చే నటులపై గాసిప్స్ మాదిరిగా సాయికిరణ్ గురించి కూడా ఓ వార్త వైరల్ గా మారింది.

సింగర్ రామకృష్ణ తనయుడిగా టాలీవుడ్ లో నువ్వే కావాలి మూవీతో ఎంట్రీ ఇచ్చిన సాయికిరణ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. తరుణ్ హీరో అయినప్పటికీ ఈ మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా అనగనగ ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది వంటి సాంగ్ సాయికిరణ్ మీదే చిత్రీకరించారు. దాంతో మొదటి మూవీతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. లయ హీరోయిన్ గా చేసిన ప్రేమించు చిత్రంలో సాయికిరణ్ నటన కూడా అద్భుతం.

సినిమాల్లో ఉండగానే ఒక హీరోయిన్ ప్రేమలో పడ్డాడని, ఫ్యామిలీ కోసం ఆమెను త్యాగం చేసి,వదులుకున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందుకోసమే సాయికిరణ్ వెండితెరకు దూరమై, బుల్లితెరకు పరిమితమయ్యాడని అంటున్నారు. మరోవైపు సినిమాల్లో ఛాన్స్ లు తగ్గిపోయాయి.

తనతో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన సదరు హీరోయిన్ కోసం తపించి చివరకు దూరంగా జరిగాడట. మనసిచ్చి చూడు సీరియల్ లో ప్రస్తుతం నటిస్తున్న సాయికిరణ్ బుల్లితెర ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే గుప్పెడంత మనస్సు సీరియల్ లో కూడా తన నటనతో ఆకట్టుకొంటున్నాడు.