MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా ?

Tollywood Heroine nivetha pethuraj : మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్‌ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సినిమాలే చేసినా తెలుగు తమిళ పరిశ్రమలో నటిగా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ భామ సినిమాల్లోకి రాకముందు బోటిక్ నిర్వహించేది. అంతేకాకుండా ఈవెంట్స్ కార్ల కంపెనీ లోనూ పని చేసింది. .

ఆ సమయంలోనే కొంతమంది స్నేహితులు సినిమాల్లో ట్రై చేయమని సూచించగా ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. మంచి పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది తక్కువ సినిమాలు చేసిన సరే పాత్ర బాగుండాలని నివేదా భావిస్తోంది. ఒకవేళ సినిమాల్లోకి రాకుండా ఉంటే యోగా ఇన్‌ స్ట్రక్టర్‌ అయ్యేదాన్ని అని చెప్తుంది.

పాగల్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చిన ఈమె త్వరలోనే విరాటపర్వం సినిమాతో అభిమానులను అలరించనుంది. పాత్రల ఎంపికలో అచి తూచి అడుగులు వేస్తూ మంచి సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."