మోసగాళ్లకు మోసగాడు రీమేక్ కి మహేష్ నో ఎందుకు చెప్పాడంటే…
Krishna Mosagallaku Mosagadu Movie :సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ మూవీస్ కి, గూఢచారి సినిమాలకు పెట్టింది పేరు. అయితే కృష్ణ సొంతంగా పద్మాలయ బ్యానర్ లో తీసిన మోసగాళ్లకు మోసగాడు అప్పట్లో సెన్షేషన్ హిట్. ఈ మూవీ ప్రస్తుతం ఆయన కుమారుడు మహేష్ బాబు చేస్తే బాగుంటుందని ఫాన్స్ భావిస్తున్నారు. అయితే మహేష్ ఎందుకు ఈ సినిమా రీమేక్ లో చేయట్లేదో స్వయంగా కృష్ణ వెల్లడించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అప్పటిలో హార్స్ రైడింగ్ నేర్చుకుని కృష్ణ నటిస్తే, విజయనిర్మల కాళ్లకు బూట్లు కూడా లేకుండా నటించింది. చాలా రిస్క్ షాట్స్ ఈ మూవీలో చేసారు. పైగా రాజస్థాన్ ఎడారి కావడంతో యూనిట్ చాలా ఇబ్బందులు పడింది. అయితే ఈ సినిమా హిట్ తో ఇబ్బందులన్నీ దిగదుడుపు అయ్యాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఆంగ్ల సినిమా ఆధారంగా ఈ సినిమా తీసినట్లు కృష్ణ చెప్పుకొచ్చారు.
కౌబాయ్ మూవీస్ లో మోసగాళ్లకు మోసగాడు ఆడినట్లు మరే కౌబాయ్ మూవీ కూడా ఆడలేదని, అందుకే ఆ మూవీ క్లాసిక్ మూవీగా నిలిచిందని కృష్ణ చెప్పారు. ఇలాంటి సినిమా రీమేక్ లో తాను నటిస్తే అప్పటి మూవీ తరహాలో ఉండదని అందుకే రీమేక్ చేయనని మహేష్ చెప్పాడని కృష్ణ తెలిపారు. ఇదే కాదు, మొదటి నుంచీ రీమేక్ మూవీస్ కి మహేష్ దూరంగానే ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తున్న మహేష్, ఆతర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేయబోయే సినిమాల్లో నటించబోతున్నాడు.

