ప్రేమ ఉన్నా విడిపోయిన నళిని దంపతులు….నళిని ఏమి చేస్తుందో తెలుసా?
Actress nalini :హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం విడిపోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం,లేదా ఒంటరిగా ఉండిపోవడం సహజం. అయితే ఒకప్పటి అందాల నటి నళినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ దంపతుల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. ఈ విషయాన్ని వాళ్ళమ్మాయి ఈ మధ్య చెప్పడంతో వైరల్ గా మారింది. ప్రస్తుతం బుల్లితెర మీద సత్తా చాటుతున్న నళిని ఒకప్పుడు ప్రేమసాగరం మూవీతో కుర్రకారు గుండెలను తాకింది.
అప్పట్లో తమిళ పరిశ్రమలో రజనీకాంత్, కమల్ హాసన్ లతో పోటీ పడి నటిస్తున్న రామరాజన్ కి మంచి డిమాండ్ ఉండేది. అతడిని ప్రేమించి, 1987లో పెళ్లి చేసుకున్న నళిని ఇద్దరు పిల్లలకు తల్లయింది. అరుణ,అరుణ్ అనే ఇద్దరు పిల్లలు పుట్టాక మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలు పెట్టింది. అయితే నళిని, రామరాజన్ ల మధ్య మనస్పర్ధలు రావడంతో 2000 సంవత్సరంలో విడిపోయారు. కోర్టులో విడాకులు మంజూరు చేస్తున్న సమయంలో న్యాయమూర్తి తీర్పు వెలువరించిన వెంటనే తట్టుకోలేక నళిని కుప్పకూలిపోవడమే కాదు, రామరాజన్ మీద వాలిపోయిందట.
ఇది చూసిన న్యాయమూర్తి ఇంతటి అన్యోన్యత గల దంపతులు ఎందుకు విడిపోతున్నారో అర్ధంకాక విస్తుపోయారట. కుమార్తె అరుణ ఈ అరుదైన వార్తను మీడియాకు వెల్లడిస్తూ, ఇప్పటికీ ఇద్దరి మధ్యా అనురాగం ఉందని, అందుకే ఇద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకోలేదని చెప్పింది. తల్లి దగ్గరే తాము పెరిగినప్పటికీ తండ్రి వద్దకు వెళ్ళడానికి ఏనాడూ ఇబ్బంది పెట్టలేదని కూడా అరుణ చెప్పింది. కాగా అప్పట్లో సంఘర్షణ,ఇంటిగుట్టు మూవీస్ లో చిరంజీవి సరసన నళిని హీరోయిన్ గా చేసింది.