MoviesTollywood news in telugu

బిగ్ బాస్ సీజన్ 5 షురూ…ప్రత్యేకతలు ఇవే…!

Bigg Boss 5 Telugu : స్టార్ మా లో ఇప్పటికే నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు 5వ సీజన్ కి రెడీ అవుతోంది. ఎన్నో విమర్శలు,ఆరోపణల నడుమ నాలుగు సీజన్స్ పూర్తికావడంతో 5వ సీజన్ ఎప్పుడా అని బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే సెప్టెంబర్ 5నుంచి బిగ్ బాస్ షో స్టార్ట్ కానున్నట్లు ప్రోమో కూడా వచ్చింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10గంటల నుంచి 11గంటల వరకూ అలాగే శని ఆదివారాల్లో రాత్రి 9న్నర నుంచి 10న్నర గంటల వరకూ ప్రసారం కానుంది. సీజన్ 3,4లకు హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జున 5వ సీజన్ కి కూడా హోస్ట్ చేయబోతున్నాడు.

ఇక కంటెస్టెంట్స్ ఎవరనేది సెప్టెంబర్ 5 సాయంత్రం 5గంటలకు ప్రారంభ షోలో తెలిసిపోతుంది. 4వ సీజన్ లో అంతగా పేరున్నవాళ్లను పెట్టలేదన్న విమర్శల నేపథ్యంలో ఈసారి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుపేర్లు వైరల్ అవుతున్నా,సెప్టెంబర్ 5న వెల్లడి కానుంది.

అంతేకాక ప్రారంభ ఎపిసోడ్ లో కూడా చాలా ప్రత్యేకతలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. మంచి TRP రేటింగ్ వచ్చేలా స్టార్ మా ప్లాన్ చేస్తుందని సమాచారం. ఈ సీజన్ బాగా ఆకట్టుకొనేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."