నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని ‘పింకీ’ ఇప్పుడు ఏమి చేస్తుందో…?
Nuvvu naaku nachav fame sudeepa : సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టు లేకుండా ఉండడం సాధారణంగా ఉండదు. ఎక్కడో చోట చైల్డ్ ఆర్టిస్టు ని పెడితే తప్ప సినిమాకు బలం రాదు. పైగా పిల్లల పట్ల హీరో, హీరోయిన్స్ కి ప్రేమ,అనురాగం ఉన్నట్లు ప్రత్యేకంగా సీన్స్ కూడా రచయిత చేత రాయిస్తున్న వైనం కూడా ఉంటోంది. ఇక అసలు విషయానికి వస్తే, విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది.
కె విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ 2001లో రిలీజయింది. ఇందులో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించిన అమ్మాయి వెంకీ థిస్ ఈజ్ పింకీ అంటూ వెంకటేష్ ని ఓ ఆట పట్టిస్తుంది. ఆ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. పింకీ పాత్రలో నటించిన ఆ అమ్మాయి పేరు సుదీప. క్లాసికల్ డాన్సర్లు అయిన సూర్యనారాయణ, సత్యవతి దంపతులకు 1987ఫిబ్రవరి 27న జన్మించిన సుదీప కూడా చిన్నతనం నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది.
1994లో మోహన్ బాబు హీరోగా వచ్చిన యమ ధర్మరాజు ఎం ఏ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా సుదీప ఎంట్రీ ఇచ్చింది. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాగానే ఆకట్టుకుంది. అలాగే మా అన్నయ్య, అల్లుడు గారు తదితర మూవీస్ లో సుదీప నటించినా పెద్దగా పేరు రాలేదు. అయితే నువ్వు నాకు నచ్చావ్ మూవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. పెద్దయ్యాక రంగనాధ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్ళాడి, ప్రస్తుతం క్లాసికల్ డాన్స్ స్కూల్ రన్ చేస్తోందట. పలు సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్ గా చేసి, సీరియల్స్ లో ఛాన్స్ కోసం ప్రయత్నించిన ఈమె రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.

