MoviesTollywood news in telugu

టాలీవుడ్ కమెడియన్ కొడుకు సక్సెస్ కొడతాడా…ఎవరో తెలుసా?

Gautham rajus son krishna Movie :సినిమాల్లో వారసుల ఎంట్రీ జోరుగానే నడుస్తోంది. స్టార్ హీరో, హీరోయిన్స్ గా వెలుగొందిన వారి పిల్లలే కాదు, కమెడియన్స్ గా రాణిస్తున్న వారి వారసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే స్టార్ కమెడియన్ గౌతమ్ రాజు తనయుడు కృష్ణ ఇప్పటికే ‘కృష్ణ రావు సూపర్ మార్కెట్’ మూవీతో ఎంట్రీ ఇచ్చి తన నటన తో ప్రేక్షకులను అలరించాడు.

తాజాగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న 2+4=24 మూవీలో కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రోల్ చేస్తున్నాడు. ఆర్.పి రామ్ దర్శకత్వంలో సావిత్రి ఫిలిమ్స్ సమర్పణ లో రీల్స్ అండ్ రీల్స్ ప్రొడక్షన్ పతాకం పై నంబిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగానే నడుస్తోంది.

అయితే కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి ప్రిన్స్ జోసెఫ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాపై గౌతమ్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కృష్ణను నిలబెడుతోందో లేదో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."