Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? కొబ్బరి నీళ్లతో అద్భుతమైన చిట్కా!

Coconut water Hair loss Remedies in telugu:జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? కొబ్బరి నీళ్లతో అద్భుతమైన చిట్కా.. రోజుల్లో మారిన జీవనశైలి,వాతావరణ కాలుష్యం, సరైన పోషకాహారం తినకపోవడం వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా అడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

సాధారణంగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడటానికి అనేక రకాల షాంపూలు,నూనెలు వాడుతూ ఉంటాయి.
hair fall tips in telugu
అయినా పెద్దగా ఫలితం కన్పించదు. ఒకవేళ కన్పించిన అది తాత్కాలికమే. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఈ సమస్య నుండి బయట పడటానికి కొబ్బరినీళ్లు ఎలా సహాయపడతాయో చూద్దాం.

కొబ్బరి నీళ్లను తల మీద మాడు మీద పోసి వృత్తాకార మోషన్ లో మసాజ్ 10 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు కొబ్బరి నీళ్లతో మసాజ్ చేయాలి.

20 నిమిషాల పాటు ఆలా వదిలేయాలి. ఆ తరవాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఆపిల్ సిడర్ వెనిగార్, కొబ్బరినీళ్ళను సమాన బాగాలుగా తీసుకోని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండాలి.

ఒక కప్పు కొబ్బరినీటిలో అరచెక్క నిమ్మరసం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."