Movies

సూపర్ స్టార్ మహేష్ ఉపయోగించిన మొదటి ఫోన్ Cost ఎంతో తెలుసా ?

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, విభిన్న సినిమాలతో ప్రిన్స్ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు సినిమాలు చేస్తూనే పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉంటున్నాడు. అంతేకాదు, వ్యాపారం, ప్రొడక్షన్ రంగాల్లో కూడా రాణిస్తున్నాడు.సినిమా సినిమాకు లుక్, స్టైలిష్ మారుస్తూ ఇప్పటికీ యంగ్ హీరోగా రాణిస్తున్నాడు.

సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత కరోనా కారణంగా ఏర్పడిన జాప్యాన్ని కవర్ చేస్తూ , సర్కారువారి పాట మూవీ షూటింగ్ లో జోరుగా పాల్గొంటున్న మహేష్ బాబు గుర్తించి తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ ఇంటర్వ్యూ సందర్బంగా తాను వాడిన మొదటి ఫోన్, సెల్ఫీ ఎవరితో దిగాడో వివరించడంతో ఇంటరెస్టింగ్ గా మారింది. సర్కారువారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆతర్వాత ఎస్ ఎస్ రాజమౌళి డైరెస్క్షన్స్ లో నటించబోతున్నాడు.

నోకియా క్లాసికల్ ఫోన్ మొదటగా ఉపయోగించానని ఓ ప్రశ్నకు బదులిచ్చిన మహేష్, ఎవరితో సెల్ఫీ తీసుకోవాలని ఉందని అడిగిన ప్రశ్నకు నాన్నతో అని ఠక్కున స్పందించా డు. ఒక్కో సినిమాకు 40నుంచి 50కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటున్న మహేష్ సినిమా లాభాల్లో వాటా కూడా అందుకుంటున్నట్లు టాక్. తాజాగా ప్రముఖ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సెలక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."