Movies

ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా…?

Tollywood hero varun sandesh :ఒక దశలో వరుస ఛాన్స్ లతో దూసుకొచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ తాజాగా ఇందువదన మూవీలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజయింది. నూతన దర్శకుడు శ్రీనివాస రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో ముంబై భామ ఫెర్నాజ్ శెట్టి హీరోయిన్ గా చేస్తోంది.

తాజాగా వరుణ్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో సో క్యూట్ అంటూ పలువురు అభిమానులు,నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకెళ్లాడు.

ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు సహజం కనుక వరుస అపజయాలు కూడా వరుణ్ ని వెంటాడాయి. దీంతో కొంతకాలం ఫారిన్ వెళ్ళి, మళ్ళీ తిరిగొచ్చాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నాడు. తాజాగా చిన్నప్పుడు తల్లీ, తండ్రితో దిగిన ఫోటోలను ఇంష్టా గ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీనికి అమ్మా, నాన్న, నేను అలాగే లవ్ సింబల్ ని అనే ట్యాగ్ తగిలించాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."