Movies

నాజర్ ఫ్రెండ్స్ కూడా స్టార్స్ అని మీకు తెలుసా.. ఎవరో ?

Tollywood actor nassar :అది విలన్ పాత్ర అయినా, ఎమోషనల్ పాత్ర అయినా, పెద్దరికం వహించే పాత్ర అయినా, చిన్నపాటి రోల్ అయినా సరే, అందులో చక్కగా ఒదిగిపోయే నటుల్లో నాజర్ ఒకరు. తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిన నాజర్ ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తారు.

ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి మూవీలో నాజర్ పాత్ర నటన అమోఘం. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో బి ఎస్సీ బోటనీ డిగ్రీ చేసిన నాజర్ నటనపై మక్కువతో రంగస్థలం వైపు అడుగులు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నటనలో మాస్టర్ డిప్లొమా చేసి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పేరు తెచ్చుకున్నారు.

నాజర్ కి టాప్ హీరోలు ఫ్రెండ్స్ గా, క్లాస్ మేట్స్ గా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విజయకాంత్ వంటి వారంతా నాజర్ కి యాక్టింగ్ స్కూల్లో క్లాస్ మేట్స్ కావడం విశేషం. అంతేకాదు, నాజర్ మంచి రచయిత కూడా.పలు పత్రికలకు కవితలు,కథలు,వ్యాసాలు అందించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."