Movies

పవర్ స్టార్ మూవీలో భల్లాల దేవుడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

Tollywood hero rana : అది హీరో వేషం అయినా, నెగెటివ్ షేడ్ వేషం అయినా సరే రక్తికట్టించడంలో ఇప్పటి యంగ్ హీరోల్లో దగ్గుబాటి రానా ఒకడు. నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రానా తర్వాత తన టాలెంట్ తో తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. పాత్రకు ప్రాధ్యాన్యం ఉండాలే గానీ అది ఏ పాత్ర అయినా సరే దుమ్మురేపేస్తాడు.

బాహుబలి మూవీలో నెగెటివ్ షేడ్ లో కన్పించి , భల్లాల దేవుడిగా అదరగొట్టిన రానా మల్టీస్టారర్ మూవీస్ కి సైతం ఒకే చెబుతున్నాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కల్సి భీమ్లా నాయక్ మూవీలో రానా నటిస్తున్నాడు. మలయాళ మూవీ అయ్యప్పమ్ కోషియమ్ మూవీకి రిమేక్ గా తెలుగులో భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసారు. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి సాగర్ కె చంద్ర డైరెక్టర్.

థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, పవన్ కి జోడీగా నిత్యామీనన్ నటిస్తోంది. అయితే రానా పక్కన ఎవరు నటిస్తున్నారో బయటకు రాలేదు.పి డి వి ప్రసాద్ సమర్పిస్తున్న ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. అయితే రానా రెమ్యునరేషన్ పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కిన్నెర మెట్ల మొగలయ్య సాంగ్ స్పెషల్ గా కన్పిస్తోంది. డానియల్ శేఖర్ గా రానా నెగెటివ్ షేడ్ లో కనిపించబోతున్నట్లు టాక్. అందుకే 25రోజుల కాల్ షీట్స్ కి 4కోట్లు తీసుకుంటున్నాడట.