Movies

నాని కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, హీరోగా మారి, వరుస విజయాలు నమోదు చేసుకుంటున్న నేచురల్ స్టార్ నాని కెరీర్ లో బెస్ట్ మూవీస్ ని పరిశీలిస్తే, నాని మొదటి సినిమా అష్టా చెమ్మా మూవీకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్టర్. కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ అందించాడు.నానికి మొదటి బ్లాక్ బస్టర్ ‘అలా మొదలైంది’ మూవీ. 2011లో వచ్చిన ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్. మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీకి నందినీ రెడ్డి డైరెక్టర్. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించాడు.

నాని, సురభి, నివేదితా థామస్ కల్సి నటించిన జెంటిల్ మెన్ మూవీ ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించాడు.ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈగ మూవీ లో నాని ఉన్నది కొద్దిసేపే అయినా తన నటనతో కట్టిపడేసాడు. సమంత హీరోయిన్, సుదీప్ విలన్. 2012లో ఈ మూవీ రిలీజయింది. కీర్తి సురేష్ తో కల్సి చేసిన నేను లోకల్ మూవీ కూడా నానికి మంచి పేరు తెచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. నక్కిన త్రినాధరావు డైరెక్టర్ గా సినిమాను బాగానే తెరకెక్కించాడు.

2015లో లావణ్య త్రిపాఠితో కల్సి నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా లో మతిమరుపు వ్యక్తిగా నాని నటన సూపర్భ్. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు. 2016లో వచ్చిన మజ్ను మూవీ కూడా బాగానే ఆకట్టుకుంది. అలాగే నిను కోరి మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. 2017లో వచ్చిన ఈ మూవీలో నివేదితా థామస్ హీరోయిన్. శివ నిర్వాణ డైరెక్టర్. నాని కెరీర్ లో మరో బెస్ట్ మూవీ జెర్సీ. సాయి పల్లవి హీరోయిన్ గా నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంసిఎ మూవీ 2017లోనే వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. 2019లో విడుదలైన ఈ మూవీకి గౌతమ్ డైరెక్టర్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."