Movies

ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన టాలీవుడ్ స్టార్స్

ప్రేమించి పెళ్లిచేసుకోవడం, ఆతర్వాత విడిపోవడం ఇండస్ట్రీలో మామూలే. తాజాగా నాగచైతన్య, సమంత విడిపోవడం తర్వాత వస్తున్న వార్తల నేపథ్యంలో పాత సంగతులను ప్రస్తావిస్తే, వీరిద్దరూ ఆరేళ్ళు ప్రేమించుకుని, 2017లో పెళ్ళిచేసుకుని, ఇప్పుడు విడిపోయారు. ఇలా విడిపోవడం ఇండస్ట్రీకి కొత్తకాదు.

అలనాటి మేటి నటి ఊర్వశి శారద, హీరో చలం ఇద్దరూ ఇష్టపడి 1972లో పెళ్లిచేసుకున్నారు. వీరి మధ్య ఏర్పడ్డ విబేధాల కారణంగా 1984లో విడిపోయారు. వయస్సులో తనకన్నా చిన్నవాడైనా శరత్ బాబు ప్రేమలో పడిన రమాప్రభ ఇష్టంతో 1981లో పెళ్లిచేసుకున్నారు.తర్వాత వచ్చిన కలతలతో 1988లో విడాకులు తీసుకున్నారు. అయితే శరత్ బాబు మరొకరిని పెళ్లిచేసుకున్నారు.

కమల్ హాసన్, సారిక ఈ ఇద్దరు స్టార్స్ ఇష్టపడి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక 2004లో విడాకులు తీసుకున్నారు. తర్వాత గౌతమితో కొన్నాళ్ళు కమల్ సహజీవనం చేసారు. 1994లో తమిళ నటి లలితా కుమారి, నటుడు ప్రకాష్ రాజ్ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2009లో విడాకులు తీసుకున్నారు. ముగ్గురు పిల్లల్లో మగ పిల్లాడు చనిపోయాడు. అయితే నాలుగేళ్ళ తర్వాత ప్రకాష్ రాజ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హీరో సిద్ధార్ధ్, మేఘన 2003లో ప్రేమించి పెళ్ళిచేసుకుని 2007లో విడిపోయారు.

సుమంత్ ,కీర్తిరెడ్డి 2004లో ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకున్నారు. అయితే రెండేళ్లకే ఇద్దరూ విడిపోయారు. తర్వాత కీర్తిరెడ్డి మరోపెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. యాంకర్ ఝాన్సీ, జోగినాయుడు ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే కలతలు ఏర్పడి 2004లో విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ఇద్దరూ బద్రీ సినిమాతో పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లిచేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.మంచు మనోజ్, ప్రణతిరెడ్డి ఇద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2015లో పెళ్ళిచేసుకుని, 2019లో విడిపోయారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."