దేవత సీరియల్ నటి రమ్య రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న దేవత సీరియల్ ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తోంది. ఇందులోని నటీనటులు తమ అందంతో, అభినయంతో ఆకట్టుకుంటు న్నారు. స్టార్ట్ అయిన కొన్నాళ్లకే మంచి టీఆర్ఫీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇందులో నటిస్తున్న రమ్య తన నటనతో, అందంతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది.
రమ్య అసలు పేరు మేఘన ఖుషి. కర్ణాటకలోని బెంగుళూరులో నవంబర్ 23న జన్మించింది. ఈమెకు ఓ బ్రదర్ కూడా ఉన్నాడు. జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ పూర్తిచేసిన ఈమె చిన్నతనం నుంచి నటనపట్ల, డాన్స్ పట్ల మక్కువ ఏర్పరచుకుంది. స్టడీస్ పూర్తయ్యాక మోడలింగ్ తో ఎంట్రీ ఇచ్చింది.
అలా గుర్తింపు తెచ్చుకున్న రమ్య కన్నడలో యాంకరింగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. కన్నడలో ఆరాగ్ని, సెవలు వంటి సీరియల్స్ తో పాటు మూవీస్ లో నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ తో మేఘన తెలుగు బుల్లితెరమీద ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. కస్తూరి, దేవత సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకుంటోంది.

