హీరోయిన్స్ కండిషన్స్ కి ఒకే చెప్పేస్తున్న ప్రొడ్యూసర్స్…ఎందుకో తెలుసా ?
ఒకప్పుడు ఏమోగానీ ఇప్పుడు నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా నుంచి ఎక్కువమంది తారలు వస్తున్నారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. దాంతో బాలీవుడ్ లో ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. దాంతో వాళ్ళు ఎలాంటి రూల్స్ చెప్పినా ప్రొడ్యూసర్స్ కూడా ఒకే చేసేస్తున్నారు. దాంతో ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో, అలాగే కోలీవుడ్ లో హీరోయిన్స్ ఛాన్స్ లు అందిపుచ్చు కుంటున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా డిఫరెంట్ లుక్ తో నటిస్తున్న పుష్ప మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. అయితే చిత్తూరు జిల్లా సాంప్రదాయ గిరిజన యువతిగా కనిపించనుంది. ఓణీ ధరించి, పైట లేకుండా కమ్మలు కూడా ధరించి రష్మిక ఆకట్టుకుంటోంది. ఈమేరకు పుష్ప శ్రీవల్లీ లుక్ కూడా రిలీజయింది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీలో కూడా రష్మిక చేస్తోంది.
అలాగే బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బై మూవీస్ లో కూడా రష్మిక నటిస్తోంది.మహానటితో స్టార్ డమ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీలో సిస్టర్ రోల్ చేస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తై మూవీలో కూడా సిస్టర్ గానే నటిస్తోంది. సమంత, సాయిపల్లవి కూడా ప్రాధాన్యత గల పాత్రలతో .
ఇప్పటి తరం హీరోయిన్ లు కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ దానికి తగ్గట్టుగా డిమాండ్ కూడా చేస్తున్నారు. ఏ పాత్ర చేయటానికి అయినా సిద్ధంగా ఉంటున్నారు. అలాగే హేరోయిన్ లు పెట్టె కండిషన్స్ కూడా నిర్మాతలు ఒకే చెప్పుతున్నారు.
