Movies

నువ్వు నేను సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

సినిమాల్లో అనేక వింతలూ వినోదాలు, విచిత్రాలు సహజం. ఒకరికి నచ్చకపోయినా మరొకరికి హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ కొట్టేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అందులో హీరోయిన్ అనిత ఒకరు. ఈమె ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నువ్వు నేను మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

డైరెక్టర్ తేజ చిత్రం మూవీతో ఉదయ్ ని హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ గా తొలిమూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక రెండవ చిత్రం కోసం ట్రై చేస్తున్న సమయంలో ఉదయ్ ని హీరోగా సెలెక్ట్ చేసారు. అయితే హీరోయిన్ గా చాలామంది ని ఆడిషన్స్ కి పిలిచినా చివరకు అనితను సెలక్ట్ చేసారు. 5నంది బహుమతులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న నువ్వు నేను మూవీ హీరోయిన్ గా ముంబై భామను సెలెక్ట్ చేసారు.

అయితే ఆమె పెట్టిన షరతులకు చిర్రెత్తుకొచ్చిన తేజ అప్పటికప్పుడు అక్కడున్న ఆరుగురిలో బాగోలేని వారెవరని అడిగి మరీ ఆ అమ్మాయినే సెలెక్ట్ చేసాడు. ప్రొడ్యూసర్ కిరణ్ అనుమానం వ్యక్తంచేసిన తేజ మాట కాదనలేక పోయాడు. తీరా సినిమా రిలీజయ్యాక కాసుల వర్షం కురిపించింది. అలాగే మొదట్లో మాధవన్ ని హీరోగా అనుకున్నారు. అయితే అతడు చేయనని చెప్పడం, ఉదయ్ రోజూ ఛాన్స్ ల కోసం రావడంతో అతడిని సెలెక్ట్ చేసారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."