Beauty TipsHealth

White Hair:హెయిర్ డై అవసరం లేదు.. తెల్లజుట్టు ఎప్పటికి నల్లగా మారాలంటే …

white hair to black hair tips in telugu :హెయిర్ డై అవసరం లేదు.. తెల్లజుట్టు ఎప్పటికి నల్లగా మారాలంటే … ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడి మార్కెట్లో దొరికే hair డ్రై వాడుతున్నారు.

అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఇంటి చిట్కాలతో సులభంగా ప్రయత్నం చేయవచ్చు.ఇప్పుడు తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం.

స్టవ్ మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోయాలి నీళ్లు కాస్త వేడెక్కాక మూడు స్పూన్లు టీ పౌడర్ వేయాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు నాలుగు లవంగాలు వేయాలి. ఐదు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. టీ డికాషన్ వడకట్టాలి. బీట్రూట్ తీసుకుని పైన చెక్కు తీసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. దీని నుంచి రసాన్ని తీయాలి.

ఈ బీట్రూట్ రసాన్ని ఐరన్ పాన్లో వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల కాఫీ పొడి ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ హెన్నా పొడి వేసి బాగా కలపాలి దీనిలో ముందుగా తయారు చేసుకున్న టీ డికాషన్ కలపాలి ఆ తరువాత ఒక నిమ్మకాయ పూర్తిగా పిండాలి ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఈ మిశ్రమం నల్లగా మారుతుంది.

ఈ మిశ్రమాన్ని తలకు రాసి రెండు గంటల తర్వాత తల స్నానం చేయాలి. ముందుగా జుట్టు బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. తరచూ వాడుతూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు చూడవలసిన అవసరం ఉండదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."