Beauty TipsHealthhealth tips in telugu

జుట్టు రాలుతోందని టెన్షన్ పడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి!

Hair Loss tips Telugu : జుట్టు రాలడం తగ్గించడానికి బెస్ట్ హోమ్ రెమెడీస్ (Hair Fall Control Tips in Telugu). ఇంట్లోనే సులభంగా దొరికే వస్తువులతో హెయిర్ ఫాల్‌ను ఎలా నివారించాలి? జుట్టును కుదుళ్ల నుంచి బలోపేతం చేసి నల్లగా, పొడవుగా పెంచుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఈ బ్లాగ్ పోస్ట్‌లో పూర్తి సమాచారం తెలుసుకోండి.

జుట్టు రాలే సమస్యకు ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే అంతా సెట్.. ప్రతి ఒక్కరూ పొడవైన అందమైన జుట్టు కావాలని కోరుకుంటారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం అయిందంటే చాలా బాధ పడతారు. జుట్టు రాలకుండా ఉండటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
Hair Fall Tips In Telugu
డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి.ఈ రెమిడీ కోసం అవిసె గింజలను ఉపయోగిస్తున్నాం.ఒక పాన్ లో అరకప్పు అవిసె గింజలు వేస్తే రెండు కప్పుల నీటిని పోసి బాగా ఉడికించాలి.

ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆవిసే గింజలను ఉడికించేటప్పుడు గ్యాస్ మీడియంలో ఉంచాలి. నురుగుతో ఉండి తెల్లగా రావడం ప్రారంభమవుతుంది.ఆ నురుగు బాగా వచ్చే వరకు ఉడికించాలి. .

ఈ విధంగా నురుగు బాగా వచ్చాక టీ నెట్ ద్వారా వడకట్టాలి. జెల్ తయారవుతుంది ఈ జెల్ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. జుట్టుకి మంచి పోషణను అందిస్తుంది. రెండు స్పూన్ల జెల్ లో ఒక స్పూన్ బాదం ఆయిల్ కలపాలి. జెల్ లో బాదం ఆయిల్ కలపటం వలన దీని శక్తి రెట్టింపు అవుతుంది.

ఈ జెల్ ని జుట్టు మూలాలకు బాగా పట్టించాలి. సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో రెండు నుంచి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.ఈ జెల్ ని రెండు వారాలు వాడితే జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు .రాలే సమస్య తగ్గి పెరగడం చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."