MoviesTollywood news in telugu

నాగ చైతన్య కెరీర్ లో టాప్ సినిమాలు ఎన్ని ఉన్నాయో చూడండి

Akkineni Naga Chaitanya Best 10 Movies : అక్కినేని వారసత్వంగా మూడో తరం కుర్రాడు నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో సినిమాలు చేసుకువెళుతున్నాడు. ఏం మాయ చేసావే మూవీలో సమంత తో కల్సి నటించిన నాగ చైతన్య మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ మూవీని గౌతమ్ మీనన్ తెరకెక్కించాడు.

తమన్నాతో కల్సి నటించిన 100%లవ్ మూవీ బాగా ఆకట్టుకుంది. 2011లో వచ్చిన ఈ మూవీ ని సుకుమార్ తెరకెక్కించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అలరిస్తుంది. ఒక లైలా కోసం మూవీ ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కింది. విజయకుమార్ కొండా డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2014లో వచ్చింది.

అక్కినేని నాగేశ్వరరావు,నాగార్జున,నాగచైతన్య,అఖిల్,సమంత ఇలా అందరూ నటించిన మనం మూవీ అక్కినేని మూడు తరాల నటులు కన్పిస్తారు. విక్రమ్ కె కుమార్ తెరకెక్కించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంటుంది.

రారండోయ్ వేడుక చూద్దాం మూవీ 2017లో రిలీజయింది.డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీలో చైతూకి మంచి విజయాన్ని అందించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు అలరిస్తాయి. సునీల్ తో కల్సి చైతు నటించిన తడాఖా మూవీ 2013లో రిలీజై ఆకట్టుకుంది.కిషోర్ కుమార్ పార్ధ సారధి డైరెక్ట్ చేసాడు.

చైతు మూడు విభిన్న గెటప్స్ లో కన్పించి ఆకట్టుకున్న ప్రేమమ్ మూవీ యూత్ ని ఆకట్టుకుంది.నటనలో పరిపక్వతను చాటుతూ మజిలీ సినిమాలో చైతు తన నటనతో ఆకట్టుకున్నాడు. సమంత హీరోయిన్ గా చేసిన ఈ మూవీని శివ నిర్వాణ తెరకెక్కించాడు. హయ్యస్ట్ గ్రాసర్ మూవీగా చైతు కెరీర్ లో నిల్చింది.

కె ఎస్ రవీంద్ర డైరెక్ట్ చేసిన వెంకీ మామ మూవీలో తన మేనమామ వెంకటేష్ తో కలిసి నాగ చైతన్య నటించి హిట్ అందుకున్నాడు. 2019లో వచ్చిన ఈ సినిమా 70కోట్లు కలెక్ట్ చేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీలో చైతూకి జోడిగా సాయిపల్లవి నటించింది. 2021లో వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."