Healthhealth tips in telugu

ఈ కాయలు కనబడితే అస్సలు వదలకండి… బంగారం కంటే విలువైనవి

budima kayalu health benefits in telugu :మన చుట్టుపక్కల ఉండే ఎన్నో రకాల మొక్కల గురించి మనకు పెద్దగా తెలీదు. వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బుడమ కాయ గురించి ఈరోజు తెలుసుకుందాం.ఇది తీపి పులుపు కలిసి విచిత్రమైన రుచితో ఉంటాయి. ఈ కాయలు పైన సన్నటి పొర లాంటి కవచం ఉండి లోపల చిన్ని పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా పండినప్పుడు టమాటా రంగులో ఉంటాయి

చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఉన్నవారు ఈ పండ్లు తినిపిస్తే నులిపురుగుల సమస్య తొలగిపోతుంది. అలాగే మలబద్దకం సమస్యకు కూడా సహాయపడుతుంది. ఈ పండ్లను దసరా రోజు అమ్మవారి దగ్గర పెట్టి కొంతమంది తింటుంటారు.

పొలాల్లో పని చేసే వారికి గాయాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కాయలను తెచ్చి వాటినుండి వచ్చే పసరును గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి. ఈ కాయలను తినడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది. ఈ కాయలలోనే కాకుండా ఆకులలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ చెట్టు ఆకులు కూడా చాలా బాగా సహాయపడుతాయి ఈ ఆకులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు రావు. కీళ్ల నొప్పులు మోకాలు నొప్పులు ఉన్నవారు ఈ ఆకులను తెచ్చి మెత్తగా నూరి నొప్పులున్న చోట కట్టడం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

.