Healthhealth tips in telugu

Popcorn:పాప్ కార్న్ తినటం అలవాటుగా మారిపోయిందా…అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే…మిస్ కావద్దు

Popcorn Health Benefits in winter : మనం సినిమాకు వెళ్ళమంటే తప్పనిసరిగా పాప్ కార్న్ కొని తింటూ ఉంటాం. ఒకవిధముగా చెప్పాలంటే పాప్ కార్న్ లేనిదే సినిమా చూసిన తృప్తి ఉండదు. అయితే బయట దొరికే పాప్ కార్న్ కన్నా మనం ఇంటిలో తయారుచేసుకున్న పాప్ కార్న్ మంచిది. పాప్ కార్న్ తయారుచేసుకోవడం కూడా చాలా సులభం.

పాప్ కార్న్ చాలా రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకవిలువలను కలిగి ఉంది. పాప్ కార్న్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పాప్ కార్న్ ని వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. పాప్-కార్న్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ B కాంప్లెక్స్, మాంగనీస్ మరియు మెగ్నీషియం ఉన్నాయి.

పాప్ కార్న్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. పాప్ కార్న్ కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పాప్ కార్న్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన రక్త నాళాలు మరియు ధమనుల గోడలపై ఉన్న కొవ్వును కరిగించటమే కాకుండా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది.

దాంతో గుండె పోటు, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు రావు. అంతేకాక గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పాప్ కార్న్ ధాన్యం జాతికి చెందినది. దీనిలో ఎండోస్పెర్మ్, జెర్మ్ మరియు బ్రాన్ అనే అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయాపడి ప్రేగు కదలికలు బాగా ఉండేలా చేసి మలబద్దకం వంటి సమస్యలు లేకుండా నివారించడంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

పాప్ కార్న్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మధుమేహం ఉన్న వారికీ చాలా మంచిది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. పాప్ కార్న్ లో అతి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ పాలీ-ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి . ఇవి
ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి. ఇవి రక్షణ ఏజెంట్స్ గా పనిచేసి క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధిస్తుంది.

పాప్ కార్న్ రెగ్యులర్ గా తినటం వలన వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ముడతలుఫైన్ లైన్స్, మచ్చలు వంటివి లేకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. పాప్ కార్న్ లో చాలా తక్కువ కేలరీలు అంటే కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. పాప్ కార్న్ తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దాంతో తొందరగా ఆకలి వేయదు. అప్పుడు తీసుకొనే ఆహారం క్వాంటిటీ కూడా తగ్గుతుంది. ఆకలిని కలిగించే హార్మోన్ల విడుదలను నిరోధిస్తుంది. దాంతో బరువు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పాప్ కార్న్ లో మాంగనీస్ సమృద్ధిగా ఉండుట వలన ఎముకల నిర్మాణంలోనూ ఎముకలు బలంగా దృడంగా ఉండటానికి సహాయపడటమే కాకూండా ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి), ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) మరియు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది.పాప్ కార్న్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రక్తహీనత సమస్య ఉన్నవారు డైలీ డైట్ లో పాప్ కార్న్ చేర్చుకుంటే రక్తంలో ఐరన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు.

పాప్ కార్న్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలోని చక్కెరను ఆకస్మికంగా పెంచదు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుటకు పాప్‌కార్న్ చాలా సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ బి3, బి6, ఫోలేట్ వంటి ఖనిజాలు ఎనర్జీని పెంచడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.

మనం సాధారణంగా తినే అన్ని రకాల స్నాక్స్ లలో పాప్ కార్న్ చాలా మంచి ఆహారం. ఇది నూటికి నూరు శాతం గింజధాన్యాల ఆహారం. పాప్ కార్న్ ప్రాసెస్ చేసిన ఆహారం కాదు కాబట్టి ప్రతి రోజు పాప్ కార్న్ తిన్నా ఎటువంటి ఇబ్బందులు రావు.

అయితే పిల్లలకు పాప్ కార్న్ పెట్టవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పిల్లలకు మాత్రం పాప్ కార్న్ మంచిది కాదు. అంటే.. పాప్ కార్న్ వలన వారికి కలిగే అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. కాకపోతే పాప్‌కార్న్ తినడంలో వారికి ఇబ్బందులు ఏర్పడుతాయి. అవును, మీరు విన్నది నిజమే. పిల్లలు పాప్ కార్న్ ను సరిగ్గా తినలేరు. అవి గొంతులో ఇరుక్కునేందుకు అవకాశం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.